ఎమ్మెల్యే అఫ్సర్ అరెస్టుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: నీలోఫర్ అస్పత్రి జూనియర్ డాక్టర్లపై అనుచితంగా ప్రవర్తించిన మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ ను, మరో 28 మందిని అరెస్టు చేయాలని నాంపల్లి శుక్రవారం పోలీసులను ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల సంఘం దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషనుపై నాంపల్లి కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల విధులను అడ్డుకున్నందుకు వారిని అరెస్టు చేయాలంటూ ఆ సెక్షన్లను కోర్టు సూచించింది. వివిధ సెక్షన్లను ఉటంకిస్తూ ఆ సెక్షన్ల కింద అఫ్సర్ ఖాన్ తో పాటు 29 మందిపై కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు నాంపల్లి పోలీసులను ఆదేశించింది.
నీలోఫర్ ఘటనకు సంబంధించి పిటిషన్ విచారణను హైకోర్టు మంగళనారానికి వాయిదా వేసింది. రాజు అనే వ్యక్తి వేసిన పిటిషనుపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విధులకు హాజరు కావాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. విధులకు హాజరు కాకపోతే ఎంసిఐకి సూచించి గుర్తింపు రద్దు చేయిస్తామని హైకోర్టు జూనియర్ డాక్టర్లను హెచ్చరించింది. రోగులకు ఇబ్బందులు కలిగించవద్దని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు జూనియర్ డాక్టర్లకు సూచించింది.












Click it and Unblock the Notifications
