చిన్నారిపై లైంగిక దాడి: సైదులు అరెస్టు
హైదరాబాద్: చిన్నారిపై లైంగిక దాడి చేసిన లోటస్ నేషనల్ స్కూల్ బస్సు అటెండర్ సైదులును పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై సైబరాబాద్ డిసిపి కాంతారావు విచారణాధికారిగా నియమితులయ్యారు. చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బయటపడగానే విద్యార్థి సంఘాలు లోటస్ స్కూలుపై దాడి చేశాయి. దీంతో ప్రిన్సిపాల్ పారిపోయాడు. స్కూలు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్కూలు యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసినట్లు కాంతారావు చెప్పారు. సైదులు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోనందుకు ఈ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. లోటస్ స్కూలు బ్రాంచులు హైదరాబాదులో నాలుగు ఉన్నాయి.












Click it and Unblock the Notifications
