చిన్నారిపై లైంగిక దాడి: స్కూల్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హైదరాబాదులోని ఎల్బీనగర్ లో గల లోటస్ పాఠశాల అటెండర్ లైంగిక దాడికి పాల్పపడ్డాడు. ఈ విషయమై చిన్నారి తల్లిదండ్రులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోటస్ స్కూల్ బస్సు అటెండర్ ఒక చిన్నారిపై 15 రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మరికొంత మంది చిన్నారులపై కూడా అతను లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం చెప్పినా పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ లైంగిక దాడికి సంబంధించిన విషయం బయటకు రాగానే విద్యార్థి సంఘాలు లోటస్ స్కూల్ పై దాడి చేశాయి. పాఠశాల ఫర్నీచర్ ను విద్యార్థి సంఘాల కార్యకర్తలు ధ్వంసం చేశారు. పాఠశాల భవంతి అద్దాలు పగులగొట్టారు. దీంతో ఎల్బీనగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించడం లేదు. పాఠశాలకు తాళం వేశారు. పాఠశాలకు అనుమతి లేదని జిల్లా విద్యాధికారి చెబుతున్నారు. లైంగిక దాడి ఘటనపై విద్యాశాఖ ఆదేశించింది.












Click it and Unblock the Notifications
