రాజకీయం వేరు: చిరు పార్టీపై వెంకయ్య
నెల్లూరు: నటన వేరు, రాజకీయం వేరని మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన మాట్లాడడానికి నిరాకరించారు. నటులు రాజకీయాల్లోకి రాకూడదని ఏమీ లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీ పెట్టాలంటే విధివిధానాలు, కార్యాచరణ, విశ్వసనీయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చిరంజీవికి పాపులారిటీ లేదని చెప్పలేమని, ఉందని ఆయన అన్నారు.
గుజరాతులో ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చేసిన అభివృద్దిని చూసి ఒర్వలేకనే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. కొన్ని రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలు ట్రెండ్ సెట్టర్ లాంటివని ఆయన అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి విషయంలో ఎన్నికల కమీషన్ చేయగలిగిందేమీ లేదని ఆయన అన్నారు. గుజరాత్ శాసనసభ మొదటి పోలింగుకు ప్రచార ఘట్టం ముగిసింది.












Click it and Unblock the Notifications
