రామోజీరావుపై 420 కేసు
విశాఖపట్నం: ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై, ఆయన కుమారుడు కిరణ్ పై విశాఖపట్నంలో 420 కేసు నమోదయింది. విశాఖపట్నంలోని సీతమ్మధారలో కోట్లాది రూపాయల విలువ చేసే భూమి ఉషా కిరణ్ మూవీస్ కు చెందిందంటూ అక్రమంగా చెప్పుకున్నారనే ఆరోపణపై ఆ కేసు నమోదయింది. ఆదిత్య ఈశ్వర కుమార్ కు చెందిన ఆ భూమిని రామోజీరావు అక్రమంగా సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
రామోజీరావుపై, ఆయన కుమారుడిపై ఆదిత్య కోర్టుకు వెళ్లాడు. దీంతో రామోజీరావుపై, ఆయన కుమారుడు కిరణ్ పై పోలీసులు 420 కేసుతో పాటు మరో నాలుగు కేసులు నమోదు చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ విషయంలో పీకల లోతు కష్టాల్లో పడిన రామోజీరావుకు భూములకు చెందిన న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.












Click it and Unblock the Notifications