రాకపోతే అరెస్టుకు ఆదేశాలు: హైకోర్టు
హైదరాబాద్: నీలోఫర్ అస్పత్రిలో మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ దాడి చేశారని ఆరోపిస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు (బుధవారం) పదిన్నర గంటలకు తమ ముందు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి హాజరు కాకపోతే సంఘం అధ్యక్షుడు రాజు అరెస్టుకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. సమ్మె వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని దాఖలైన ప్రజా ప్రయోజనాల పిటిషనుపై హైకోర్టు విచారణ చేపట్టింది.
నాలుగు రోజులైన జూనియర్ డాక్టర్లు కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. సంఘం గుర్తింపును రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను విరమించేది లేదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు.












Click it and Unblock the Notifications