వరంగల్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ హతం
వరంగల్: వరంగల్ జిల్లా తాడ్వాయి - పస్రాల మధ్య పోలీసులకు, నక్సలైట్లకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మరణించారు. మృతులను ప్రజాప్రతిఘటన నక్సలైట్లుగా గుర్తించారు. అయితే వారి వివరాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. సంఘటనా స్థలం నుంచి 2తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను ప్రజాప్రతిఘటన చంద్రన్న దళానికి చెందినవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎదురుకాల్పుల నుంచి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల కార్యదర్శి సురేష్ తప్పించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications