మంటల్లో కాలుతూ నిర్మాత కూతురికి కౌగిలింత
హైదరాబాద్: హైదరాబాదు నడిబొడ్డున గల పంజగుట్టలో ఒక ప్రేమోన్మాది సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యకు యత్నించి తన ప్రియురాలిని తాను కాలిపోతూ కౌగలించుకున్నాడు. వెంకట్రాజు అనే యువకుడు తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో తాను కాలిపోతూ ప్రియురాలిని కౌగలించుకున్నాడు. ఈ సంఘటనలో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాజు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రియురాలికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రియురాలు ప్రముఖ నిర్మాత కూతురని సమాచారం. వారిద్దరు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సినీ నిర్మాత పాండురంగారావు కుమార్తెను ఆయన డ్రైవర్ రాజు గత కొంత కాలంగా ప్రేమిస్తూ వచ్చాడు. వారిద్దరూ రెండు నెలల పాటు జంషెడ్‌పూర్‌కు వెళ్లి వచ్చారని కూడా చెబుతున్నారు. ఇటీవల మళ్లీ నగరానికి తిరిగి వచ్చిన వారిని పాండురంగారావు విడదీయడంతో ఆగ్రహించిన రాజు ప్రియురాలి ఎదుటే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మంటలు రేగిన తరువాత ప్రియురాలిని కూడా కౌగిలించుకున్నాడు. పాండురంగారావు పోలీసు స్టేషన్‌లో రాజుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications