మోడీపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని సహనిందితుడిగా చేర్చాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ ప్రారంభించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగ్రోల్‌లో జరిగిన బహిరంగ సభలో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసిందే.
కోర్టు విచారణలో ఉన్న సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడంపై మోడీకి నోటీసులు జారీ చేయాలని అదనపు సోలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం, సొహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ షేక్ తరపు న్యాయవాది దుష్యంత్ దేవ్‌లు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడంపై మోడీని వివరణ కోరాలని, ముఖ్యమంత్రి కూడా న్యాయవ్యవస్థకు జవాబుదారీ అని వారు తమ పిటిషన్లపై పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications