అసభ్య ప్రవర్తనతో యువతులను హడలెత్తించిన మరో సైకో
హైదరాబాద్: హైదరాబాదులోని నారాయణగుడా ఫ్లై ఓవర్ వద్ద ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ఉన్మాది అసభ్య ప్రవర్తనతో యువతులను హడలెత్తించాడు. ఈ సంఘటన శనివారం నాడు గచ్చీబౌలీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన అజహర్ అనే ఉన్మాది పార్క్ లలోకి సేద తీరడానికి వచ్చిన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ హడలెత్తించాడు. యువతుల వద్ద ఉన్న బ్యాగులను లాక్కొన్నాడు. ఈ ఉన్మాది తీరుకు బెదిరిన యువతులు పార్క్ వదిలి పరిగెత్తారు. ఇతని విపరీత ప్రవర్తనను గమనించిన స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అజర్ మాటలు విన్న పోలీసులు సైతం నోరు వెళ్లబెట్టక తప్పని పరిస్థితి అయింది.












Click it and Unblock the Notifications
