చిరు రాజకీయం మీడియాదే: జెసి
ఏలూరు: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశం అంతా మీడియా సృష్టేనని రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి రాజకీయ ప్రవేశం వార్తలపై స్పందించడానికి ఆయన నిరాసక్తత ప్రదర్శించారు. ఆలు లేదు, చూలు లేదన్నట్లుగా చిరంజీవి రాజకీయాల ప్రభావంపై మాట్లాడుతున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
చిరంజీవి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన తర్వాత ఆ ప్రభావం ఎవరి మీద ఎలా ఉంటుందో చెప్పడానికి వీలుంటుందని, ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తనకు చిరంజీవే కాకుండా మరో సినీనటుడు బాలకృష్ణ కూడా సన్నిహితులేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications