ప్రమోద్ హత్య కేసులో ప్రవీణ్ కు జీవిత ఖైదు
ముంబై: బిజెపి సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ హత్య కేసులో ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్ కు జీవిత ఖైదు పడింది. ప్రమోద్ మహాజన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు ప్రవీణ్ మహాజన్ కు 15వేల రూపాయల జరిమానా విధించింది.
ప్రమోద్ మహాజన్ హత్య కేసులో ముంబై సెషన్స్ కోర్టు సోమవారం ప్రవీణ్ మహాజన్ ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రమోద్ మహాజన్ ను హత్య చేసినందుకు తాను బాధపడటం లేదని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నానని ప్రవీణ్ మహాజన్ అన్నారు. కోర్టు శిక్ష తాను ఊహించిందేనని ఆయన అన్నారు. తన బాధంతా తన కుటుంబ సభ్యుల గురించేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications