జుడాలపై ఎస్మా ప్రయోగం తప్పు: బాబు
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లపై ఎస్మా ప్రయోగించాలనే నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తప్పు పట్టారు. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు నచ్చజెప్పడానికి బదులు వారిపై ఎస్మా ప్రయోగించడం సరి కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేస్తామంటే మంచిది కాదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జూనియర్ డాక్టర్లను రెచ్చగొట్టారని, అయినా తాను వారిపై ఎస్మా ప్రయోగించలేదని ఆయన చెప్పారు. డాక్టర్లను కొడితే కూడా ఈ ప్రభుత్వం కాపాడలేకపోతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications