జుడాలపై ఎస్మా ప్రయోగానికి జీవో
హైదరాబాద్: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల సమ్మెపై ఎస్మా ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. అందుకుగాను ప్రభుత్వం 423 జీవోను జారీ చేసింది. ఈ జీవోతో ప్రభుత్వానికి అసాధారణ అధికారాలు సంక్రమిస్తాయి. అత్యవసర సర్వీసులకు ఆటంకం కలిగించినందుకు, సమ్మె చేస్తున్నందుకు జూనియర్ డాక్టర్లను ఎటువంటి వారంట్ లేకుండా అరెస్టు చేసే అధికారం ఉంటుంది.
ఎస్మా ప్రయోగం వల్ల జూనియర్ డాక్టర్లు ఆరు నెలల పాటు సమ్మె చేయడానికి వీలు లేదు. సమ్మె చేస్తే అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. సమ్మెకు మద్దతిచ్చినా, సహకరించినా కూడా ఏడాది పాటు జైలు శిక్ష పడుతుంది. అయితే జూనియర్ డాక్టర్లు దిగి వచ్చే అవకాశం ఉండడంతో ఇంకా ప్రయోగానికి దిగలేదు. ఈ స్థితిలో కాకతీయ వైద్య కళాశాల మెడికోలు హాస్టల్స్ ను ఖాళీ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల ప్రయోగించడానికి ఈ జీవో జారీ చేయడం లేదని, ప్రభుత్వం ఒక చట్టం తీసుకుని రావాలంటోందని, అందుకే జీవో జారీ చేశామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications