జూనియర్ డాక్టర్లపై వత్తిడి
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె ఈరోజే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. భద్రతపై లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు పట్టుబడుతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంచాలన్నది వారి ప్రధాన డిమాండ్. జూనియర్ డాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే.
వైద్య శాఖ మంత్రి గల్లా అరుణ కుమారి మాత్రం అలా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇలా ఉండగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగి జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించుకునేలా ఒత్తిడి తెస్తోంది. సామాజిక బాధ్యతను శిరసావహించి జూనియర్ డాక్టర్లు విధులకు హాజరు కావాలని మెడికల్ కౌన్సిల్ సూచించింది.












Click it and Unblock the Notifications