లోకేష్, బ్రాహ్మణిలతో తిరుమలలో బాలకృష్ణ
హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ దంపతులు గురువారంనాడు తిరుమలేశుని దర్శించుకున్నారు. అల్లుడు లోకేష్, కూతురు బ్రాహ్మణిలతో కలిసి ఆయన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, విఐపిలు తిరుమలేశుడ్ని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీతో తిరమల కిటకిటలాడుతోంది. విఐపి టికెట్లను రద్దు చేసి సెల్లార్ టికెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో సెల్లార్ టికెట్ల కౌంటర్ వద్ద తొక్కిసలాట వాతావరణం నెలకొంది. వేలాదిగా తిరుమలకు భక్తులు తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications