రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఇటుకల లోడుతో వస్తున్న లారీ ఆగి ఉన్న ట్రాక్టరును ఢీకొట్టి అనంతరం విద్యుత్ టవరుపై పడింది. దీంతో ఇటుకల కింద కూలీలు కూరుకపోయారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. లారీ బ్రేక్ విఫలం కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications