బాలకృష్ణ కటౌట్ ధ్వంసం: రాస్తారోకో
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్చూరులో సినీ నటుడు బాలకృష్ణ కటౌట్ ను ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. బాలకృష్ణ అభిమానులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి బాలకృష్ణ అభిమానులు పర్చూరుకు తరలి వస్తున్నారు. పరిస్థితిని డయస్పీ పర్యవేక్షిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కటౌట్ ను ధ్వంసం చేశారు.
బాలకృష్ణ కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒకే మగాడు అడియో విడుదల కార్యక్రమంలో అభిమానులు నినాదాలు చేసిన నేపధ్యంలో కటౌట్ ధ్వంసం కావడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. పర్చూరులో అభిమానులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.












Click it and Unblock the Notifications