తండ్రిని చంపిన కసాయి లొంగుబాటు
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో తండ్రిని చిత్రహింసలు పెట్టి చంపిన కసాయి కుమారుడు సోమవారం హైదరాబాదులోని సంజీవరెడ్డి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఈ నెల 21వ తేదీన బీర చంద్రశేఖర్ అనే యువకుడు తన తండ్రిని నోట్లో బట్టలు కుక్కి, కాళ్లకు మేకులు కొట్టి చిత్రహింసలు పెట్టి హత్య చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో చంద్రశేఖర్ ఆ పని చేశాడు.
తన తండ్రిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని, తాను చంపలేదని, బెదిరిస్తే డబ్బులు ఇస్తాడనే ఉద్దేశంతో నోట్లో బట్టలు కుక్కానని, కాళ్లను సూదులతో గుచ్చానని, మేకులు కొట్టలేదని అతను చెబుతున్నాడు. తన తల్లిని తాను కొట్టలేదని, తనకు అడ్డు వస్తుంటే తోసేశానని, దాంతో ఆమె కింద పడిపోయి గాయపడిందని అతను అంటున్నాడు.












Click it and Unblock the Notifications