చిరంజీవి తండ్రి వెంకట్రావు కన్నుమూత
హైదరాబాద్: హీరో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు (70) సోమవారం ఉదయం ఏడు గంటలకు కన్ను మూశారు. ఆయన మృతదేహాన్ని జూబిలీహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని స్వగృహం ఆవరణలో ఉంచారు. హీరో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, రామానాయుడు, కె. రాఘవేంద్రరావు, ఎమ్మెస్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయనను ఓదార్చారు.
కొణిదెల వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వెంకట్రావు కొన్ని రోజులుగా హృద్రోగంతో బాధపడుతున్నారు.












Click it and Unblock the Notifications