వృద్ధాప్యం వల్ల కాకా వినకపోవచ్చు: ఎమ్మెస్సార్
హైదరాబాద్: తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డే అడ్డంకి అని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలు తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి (కాకా)కి వినిపించకపోయి ఉండవచ్చునని, కాకాకు ముసలితనం... అనారోగ్యం కదా అని సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాణ రావు అన్నారు. వాస్తవాలు మాట్లడడానికి అందరూ ఎమ్మెస్సార్ లు కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాకా తెలంగాణవాదేనని సుస్పష్టమైందని ఆయన అన్నారు.
తాను చెప్పేదేదో చెప్పానని, తన మాటలను వెంకటస్వామి ఖండించలేదని, తాను వినలేదని మాత్రమే చెప్పారని, పెద్దమనిషి, దానికి తోడు అనారోగ్యం, దాని వల్ల వెంకటస్వామి విని ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. సభలకు వచ్చేవారందరూ ఓటేయరని గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఆయన అన్నారు. అద్దె బస్సులపై కార్మిక సంఘాలకు చిత్తశుద్ధి లేదని, చర్చలకు పిలిస్తే ఒక్కరు కూడా రాలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications