రేపే మోడీ ముఖ్యమంత్రిగా ప్రమాణం
గాంధీ నగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత నరేంద్ర మోడీ మళ్లీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. శాసనసభ పక్ష నాయకుడిగా పార్టీ శాసనసభ్యులు సోమవారం లాంఛనంగా మోడీని ఎన్నుకున్నారు. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.
ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం జరగనుంది. ఇంతకముందు వరకు ముఖ్యమంత్రి బాధ్యతలను ఈ నెల 27న చేపట్టాలని నరేంద్ర మోడీ భావించారు. అయితే మాజీ ప్రధాని, బీజేపీ కీలక నేత అటల్ బీహారీ వాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా ఆయన మంగళవారమే ఈ బాధ్యతలు చేపట్టబోతున్నారు.గాంధీ నగర్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం 12.50 గంటలకు మోడీ చేత గుజరాత్ గవర్నర్ నవల్ కిషోర్ శర్మ ప్రమాణస్వీకారం చేయిస్తారని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications