సమ్మెను నివారిస్తాం: దినేష్ రెడ్డి


హైదరాబాద్: సమ్మెను నివారిస్తామని, అద్దె బస్సులను తీసుకోవడంపై కార్మికుల్లో ఉన్న అపోహలను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) దినేష్ రెడ్డి అన్నారు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసికి లాభమే గాని నష్టం ఉండదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

బెంగుళూర్ కు చెందిన ఐఐఎం నివేదిక ఆధారంగానే అద్దె బస్సులను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఆర్టీసికి ప్రయాణికులు పెరిగారని, వారి అవసరాల కోసం మరిన్ని బస్సులను వేయాల్సి ఉందని, కొత్త బస్సులను కొనడానికి అవసరమైన నిధులు ఆర్టీసి వద్ద లేవని, అందువల్ల అద్దె బస్సులు తీసుకోవాల్సి వస్తున్నదని ఆయన అన్నారు. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయకూడదనే ముఖ్యమంత్రి ఆదేశాలు దీపావళికి పరిమితమని, క్రిస్మస్, సంక్రాంతికి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+