గుజరాత్ విజయం గొప్ప మలుపు: అద్వానీ

మంగళవారం ఆయన న్యూఢిల్లీలో జరిగిన మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి జన్మదినోత్స వేడుకల్లో మాట్లాడుతూ గుజరాత్ విజయం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదని అన్నారు.
జాతీయ రాజకీయాల్లో కూడా కీలక మలుపని ఈ విజయం నిరూపించుకుంటుందని అద్వానీ అభిప్రాయపడ్డారు. వాజ్‌పేయితో తన దీర్ఘకాల బంధం గురించి అద్వానీ ఈ సందర్భంగా మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరాజయం అనంతరం తామిద్దరం పహర్‌గంజ్‌లోని ఇంపీరియల్ థియేటర్‌లో ఫిర్ సుబాహ్ హోగీ అనే సినిమాకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. బీజేపీలో వాజ్‌పేయి పాత్ర వెలకట్టలేనిదని అద్వానీ చెప్పారు. పార్టీలోనూ, పార్టీ బయటా వాజ్‌పేయి సమాన గౌరవం పొందారని అద్వానీ తెలిపారు.












Click it and Unblock the Notifications