గిన్నీస్ బుక్‌లో ఢిల్లీ అక్షర్‌ధామ్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా దేశ రాజధాని ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయం గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లిమిటెడ్ సీనియర్ అధికారి ఒకరు గత వారం రెండు ప్రపంచ రికార్డు సర్టిఫికేట్లు అందించేందుకు ఇక్కడకు వచ్చారు. స్వామినారాయణ్ సంస్థానం అధిపతి ప్రముఖ్ స్వామి మహరాజ్ అత్యధిక హిందూ దేవాలయాలు నిర్మించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకున్నారు.
గిన్నీస్ బుక్ రికార్డుల కమిటీ సీనియర్ సభ్యుడు మైకెల్ విట్టీ ఇందుకు సంబంధించిన రెండు ధృవపత్రాలను గతవారం బీఏపీఎస్‌కు అందించారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థానం (బీఏపీఎస్) అత్యధిక హిందూ దేవాలయాలను నిర్మించిన సంస్థగా గిన్నీస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఏప్రిల్ 1971 నుంచి నవంబర్ 2007 మధ్య కాలంలో ఐదు ఖండాలలో మొత్తం 713 ఆలయాలు నిర్మించి బీఏపీఎస్ రికార్డు సృష్టించింది.












Click it and Unblock the Notifications