నయాపూల్ దాడి కేసులో గౌసియా అరెస్టు
హైదరాబాద్: హైదరాబాదులోని నయాపూల్ అస్పత్రిలో దాడి కేసులో ప్రధాన నిందితురాలు గౌసియా బేగంను పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. నయాపూల్ అస్పత్రిలో ఇటీవల ఒక మహిళా రిమాండ్ ఖైదీ మృతితో ఆగ్రహించి కొంత మంది జూనియర్ డాక్టర్ కామాక్షిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో గౌసియా ప్రధాన నిందితురాలు. ఇంతకాలం ఆమె పరారీలో ఉంది. ఆమెపై పది కేసులు పెట్టినట్లు ఎసిపి రెడ్డన్న చెప్పారు.
నయాపూల్ దాడి కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఈ దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దాడి చేసినవారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం జూనియర్ డాక్టర్లకు హామీ ఇచ్చింది. ఆ మేరకు కేసు పెట్టి గౌసియా కోసం ఇంత కాలం పోలీసులు గాలిస్తూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications