బెనజీర్ అంత్యక్రియలు పూర్తి
లార్ఖానా:దారుణ హత్యకు గురైన పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో అంత్యక్రియలు లార్ఖానాలో జరిగాయి. గురువారం సాయంత్రం రావల్పిండీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని వెళ్లిపోయే సందర్భంలో మానవబాంబు ఒక్కసారిగా పేలడం, అనంతరం ఆమెపై రెడీగా ఉన్న దుండగులు కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
కాగా ఆమె తండ్రి అంత్యక్రియలు జరిగిన చోటే బెనజీర్ బుట్టో అంత్యక్రియలు జరిపారు. ఆమె అంత్యక్రియల ర్యాలీలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అంత్యక్రియలు ముందు పాకిస్తాన్ అంతటా ఆమె అభిమానులు పెద్ద యెత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. పెట్రోల్ బంకులు, బ్యాంకులను తగులబెట్టారు.












Click it and Unblock the Notifications
