సీమ రాష్ట్రం ఇవ్వాల్సిందే: మైసురా
హైదరాబాద్: తాము రాయలసీమ రాష్ట్రాన్ని కోరుతున్నట్లు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎం.వి. మైసురారెడ్డి అన్నారు. అయితే అందరూ పార్టీ నాయకులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విడిపోవాలనుకుంటే తామూ విడిపోవాలని, కలిసుంటే తామూ కలిసి ఉండాలని రాయలసీమ ప్రజలు అనుకుంటున్నారని ఆయన చెప్పారు.
అన్ని ప్రాంతాలు కలిసి ఉండి అభివృద్ధి చెందాలని రాయలసీమ ప్రజలు అనుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయదలుచుకుంటే రాయలసీమ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications