బంజారాహిల్స్ పీఎస్ కు వింత పంచాయితీ.. వాట్సప్ గ్రూప్లో యాడ్ చేయట్లేదని మహిళ ఫిర్యాదు!

హైదరాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ వచ్చి చేసిన ఫిర్యాదు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్థానిక బస్తీ సమస్యలు చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి తనను తొలగించారని, తిరిగి ఆ గ్రూప్‌లో చేర్చాలని ఆమె పోలీసులను కోరింది.

స్థానిక సమస్యల కోసం వాట్సప్ గ్రూపు

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ప్రాంతంలో ఎన్‌బీటీ నగర్ వాసుల కోసం ఈ గ్రూప్ ఉంది. ఇక్కడి వాసులు తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు వంటి స్థానిక సమస్యలపై చర్చించుకోవడానికి ఈ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ కొంతకాలంగా కొందరు సభ్యులు రాజకీయసందేశాలు, పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. దీనిపై గ్రూప్ అడ్మిన్ అభ్యంతరం వ్యక్తం చేసి, గ్రూప్ నియమాలు పాటించాలని, రాజకీయాలు పక్కన పెట్టి స్థానిక సమస్యలపైనే మాట్లాడాలని హెచ్చరికలు ఇచ్చారు.

complaint on whatsapp group Hyderabad Woman Files Police Complaint to Rejoin in WhatsApp Group

మానసికంగా వేధిస్తున్నారంటూ రాతపూర్వకంగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

అయినా ఈ మహిళ ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా వరుసగా రాజకీయ పోస్టులు పెట్టడం కొనసాగించింది. దీంతో ఆగ్రహించిన అడ్మిన్ ఆమెను గ్రూప్ నుంచి తొలగించేశారు. తర్వాత ఆమె అడ్మిన్‌ను పలుమార్లు సంప్రదించి తనను మళ్లీ గ్రూప్‌లో చేర్చాలని అడిగింది. కానీ అడ్మిన్ నిరాకరించడంతో ఆమె దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ రాతపూర్వకంగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమెను గ్రూప్ లో చేర్చుకునేది లేదన్న గ్రూప్ అడ్మిన్

పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిచి మాట్లాడారు. అడ్మిన్ తన నిర్ణయం మీద గట్టిగా ఉన్నారు. గ్రూప్ నియమాలను పదే పదే ఉల్లంఘించినందునే ఆమెను తొలగించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ చేర్చుకోమని స్పష్టం చేశారు. ఈ విషయం చూసి పోలీసులు కూడా తలలు పట్టుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా నేరాలు, ఫిర్యాదులు వచ్చే స్టేషన్‌లో వాట్సాప్ గ్రూప్ లొల్లి వచ్చి పడటం వారికి కొత్త అనుభవం.

ఏపీలో డేంజర్ పురుగులు..కంట్లోపడితే చూపు పోయే ప్రమాదం.. ఆ జిల్లా వారికి నరకం!
ఏపీలో డేంజర్ పురుగులు..కంట్లోపడితే చూపు పోయే ప్రమాదం.. ఆ జిల్లా వారికి నరకం!

ఈ కేసులో పోలీసులు ఏం చేస్తారో

ఈ ఘటన సోషల్ మీడియా గ్రూపుల్లో నియమాలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేస్తున్నాయి. గ్రూప్ అడ్మిన్‌లు తమ గ్రూపులను సరైన విధంగా నడిపించడం ఎంతో కష్టమని ఈ సంఘటన చూపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు ఏం చర్య తీసుకోవాలో ఆలోచిస్తున్నారు. గ్రూప్ అడ్మిన్ చేసిన తప్పేమీ లేదు, కానీ మహిళ తనను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయటం పోలీసులకు ఏం చెయ్యాలో సందిగ్ధంలో పడేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+