చేగొండిని హీరో కానివ్వం: జిఎస్ రావు
హైదరాబాద్: పార్టీ నుంచి బహిష్కరిస్తే హీరో అయిపోదామని తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు చేగొండి హరిరామజోగయ్య అనుకుంటున్నారని, కానీ తాము అలా కానివ్వమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు అన్నారు. వయస్సు పైబడి హరిరామజోగయ్య మతి లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
హరిరామజోగయ్య వ్యవహారాలను పార్టీ అధిష్ఠానవర్గం చూస్తోందని, ఈసారి హరిరామజోగయ్యపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే జోగయ్య భవిష్యత్తు కష్టమేనని ఆయన అన్నారు. సొంత ఎజెండాతో హరిరామజోగయ్యతో ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications