వరద బాధితులను ఆదుకోండి: బాబు
హైదరాబాద్: ఐదు జిల్లాల్లోని వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రకాశం తదితర జిల్లాలో వర్షాల వల్ల విపరీతమైన పంట నష్టం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. వరద తాకిడికి గురైన ప్రకాశం జిల్లాలో చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు.
వరద తాకిడికి నష్టమైన పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఐదు వేల రూపాయల చొప్పున రైతులకు ఇన్ పుట్స్ సబ్సిడీ అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తడి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన కోరారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలను కొరుతూ పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
