రాయబారాలతో తెలంగాణ రాదు: సిపిఐ
హైదరాబాద్: రాయబారాల ద్వారా, పైరవీల ద్వారా తెలంగాణ రాష్ట్రం రాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు తమను రాయబారం నడపాలని అడుగుతున్నారని, తాము అందుకు సిద్ధంగా లేమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఒత్తిడి తెచ్చే శక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాజకీయ పోరాటమే శరణ్యమని ఆయన అన్నారు.
మూకుమ్మడి రాజీనామాలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. తెరాస ప్రజాప్రతినిధులు రాజీమానాలు చేయాలనుకోవడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో ఉండే తెలంగాణ కోసం పోరాటం చేయాలని ఆయన తెరాసకు సూచించారు. ఐదేళ్ల కోసం పోటీ చేసి గెలిచిన తర్వాత ఈలోగానే రాజీనామాలు చేయడం, మళ్లీ పోటీ చేసి గెలవడం అనేది సరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
