రాష్ట్రంలో జీఆర్టీ తొలి షోరూమ్ ప్రారంభం
తిరుపతి: చెన్నైకి చెందిన జీఆర్ తంగమాలిగై (జీఆర్టీ) ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి షోరూమ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేసింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) గుర్తింపు పొందిన జీఆర్టీ జ్యూవెలర్స్ బంగారు, వజ్రాభరణాల షోరూమ్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు జీఆర్టీ గ్రూపు జనరల్ మేనేజర్ ఎన్.నాగరత్నం తెలిపారు.
వచ్చే ఆరు నెలల కాలంలో హైదరాబాద్‌లో కూడా ఆభరణాల షోరూమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జీఆర్టీ గ్రూపు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications
