డిపాజిట్లు దక్కనివారా మాట్లాడేది?: గోనే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ గల్లంతు అవుతుందంటున్న సీనియర్ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకుడు గోనె ప్రకాశరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. 1989 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని వారు తెలంగాణలో పార్టీ జయాపజయాల నిర్ణాయక శక్తిపై మాట్లాడుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారు నోరు మూసుకుంటే పార్టీ భవిష్యత్తు ఉంటుందని, వారికైతే భవిష్యత్తు లేదని ఆయన అన్నారు.

పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి మూడు సార్లు ఓడిపోయారని, ఒక సారి శాసనసభకు, రెండు సార్లు లోకసభకు పోటీ చేసి ఓడిపోయారని ఆయన చెప్పారు. తమ పార్టీ సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు రామన్నపేట నుంచి 1989 ఎన్నికల్లో తుక్కు తుక్కుగా ఓడిపోయారని ఆయన చెప్పారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా అంతేనని ఆయన అన్నారు. మరో సీనియర్ శాసనసభ్యుడు కూడా 1989 ఎన్నికల్లో ఓడిపోయారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+