లుంబినీ పార్కు పేలుడు: నసీర్ నిందితుడు
హైదరాబాద్: హైదరాబాదులోని లుంబినీ పార్కులో జరిగిన బాంబు పేలుడు నిందితుడ్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. లష్కర్ - ఎ - తోయిబాకు చెందిన రియాజుద్దీన్ నసీర్ లుంబిని పార్కులో బాంబు పెట్టినట్లు పోలీసుసు గుర్తించారు. ఆరు నెలల క్రితం లుంబినీ పార్కులో బాంబు పేలి 11 మంది మరణించగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. లేజర్ షో జరుగుతుండగా నసీర్ లుంబినీ పార్కులోకి వెళ్లి బాంబు ఉన్న నల్లరంగు సంచిని పెట్టి అది పేలడానికి ముందు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
దీంతో పోలీసుల బరువు కాస్తా తగ్గినప్పటికీ అదే రోజు హైదరాబాదు కోఠీలోని గోకుల్ చాట్ లో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసును విడదీయాల్సి ఉంది. నిరుడు ఆగస్టు 25వ తేదీన జరిగిన పేలుడులో గోకుల్ చాట్ లో 25 మంది మరణించారు. నార్కో ఎనాలిసిస్ పరీక్షల ద్వారా పేలుడులో నసీర్ పాత్రను పోలీసులు తెలుసుకోగలిగినట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు లుంబినీ పార్కు పేలుడు కేసు నిందితుడి ముఖం స్కెచ్ వేశారు.












Click it and Unblock the Notifications
