శంషాబాద్ లో ట్రయల్ రన్ సక్సెస్
హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ విమానాశ్రయంలో తొలిసారిగా కింగ్ ఫిషర్ విమానం దిగింది. ఈ విమానం ముంబయిలో మధ్యాహ్నం ఒంటి గంటా యాభై నిమిషాలకు బయలుదేరింది. శంషాబాద్ విమానాశ్రయంలో అది మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు దిగింది.
శంషాబాద్ విమానాశ్రయాన్ని వచ్చే నెల 14వ తేదీన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రారంభిస్తారు. కింగ్ ఫిషర్ విమానంలో కొంత మంది మీడియా ప్రతినిధులు, సంబంధిత సంస్థ ఉద్యోగాలు ప్రయాణించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఈ ట్రయల్ రన్ ను తిలకించారు












Click it and Unblock the Notifications
