రైతులతో జైలుకు వెళ్తా: బాబు

Chandrababu Naidu
ఒంగోలు: రైతులతో జైలుకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పులు కట్టవద్దని, ఒక వేళ జైలుకు పంపిస్తే మీతో పాటు నేనూ జైలుకు వస్తానని ఆయన ప్రకాశం జిల్లా రైతులతో అన్నారు. ప్రకాశం జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. తడిసిపోయిన శనగ, పొగాకు పంటలను చూశారు. రైతులు చంద్రబాబు వద్ద తమ గోడును వెళ్లిబోసుకున్నారు. రైతులను ఆదుకోవాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.

రైతు సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మరింత పేదలవుతున్నారని ఆయన అన్నారు. రైతులకు తన అండదండలు ఎల్లవేళలా ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. తాను రాజకీయం చేయడానికి ఇక్కడికి రాలేదని, రైతులను ఆదుకోవడానికే వచ్చానని ఆయన చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సాకులు చెబుతోందని, ప్రభుత్వం దిగి వచ్చే దాకా వదలబోనని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+