వైయస్ కాంగ్రెస్ చివరి సిఎం: దేవేందర్

తెలంగాణపై కాంగ్రెస్ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా అందరి అభిప్రాయాలు అడగడమేమిటని ఆయన అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ నలిగిపోతోందని ఆయన అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ఒక మాట ఇక్కడ మరో మాట చెబుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెరాసలో చిచ్చు పెట్టారని ఆయన అన్నారు. తెలంగాణపై దేవేందర్ గౌడ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు అతీ గతీ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు గురించి మాటలే తప్ప చేతలు లేవని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధపై ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
