రాజీనామాలు చేయండి: హరీష్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇస్తామని పోటీ చేసిన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు సవాల్ చేశారు. తాము రాజీనామాలు చేస్తాం, కాంగ్రెసు వారు కూడా రాజీనామా చేయాలని ఆయన గురువారం శాసనసభలో అన్నారు. తెలంగాణపై ఇంత వరకు కాంగ్రెస్ తన వైఖరిని తెలియజేయకపోవమేమిటని ఆయన అడిగారు. తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని సిపిఐ, బిజెపి అంటున్నాయని, ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం బిల్లు ప్రతిపాదించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో ముఖ్యమంత్రి బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రణబ్ ముఖర్జీ కమిటీ రెండు సార్లు మాత్రమే సమావేశమైందని, అభిప్రాయ సేకరణకు ప్రణబ్ కమిటీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణను అభివృద్ది చేస్తుందనే మాట పచ్చి అబద్దమని, తెలంగాణను విధ్వంసం చేస్తోందని ఆయన విమర్శించారు. కడప జిల్లాలో జరిగిన అభివృద్ధిలో సగం కూడా తెలంగాణలోని ఏ జిల్లాలో జరగలేదని ఆయన అన్నారు. తాము అభివృద్ధిని కోరుకుంటున్నామని, దాంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కోరుకుంటున్నామని, తెలంగాణ తమ జన్మహక్కు అని ఆయన అన్నారు. నక్సలైట్ సమస్యను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సాకుగా చూపుతున్నారని, ముఖ్యమంత్రి సూచన మేరకే ఇంటలిజెన్స్ నివేదిక తయారైందని ఆయన అన్నారు. నక్సలైట్ సమస్య ఎక్కడ లేదని ఆయన అడిగారు. జగిత్యాల ప్రాంతంలో పెద్ద యెత్తున నక్సలైట్ ఉద్యమం సాగిందని, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఉద్యమం సద్దుమణిగిందని, సాగునీటి ప్రాజెక్టులు చేపడితే నక్సలైట్ సమస్య పరిష్కారమవుతుందని ఆయన చెప్పారు.

నక్సలైట్లను కూడా కాంగ్రెస్ మోసం చేసిందని, చర్చలకు పిలిచి ఆ తర్వాత నక్సలైట్లను పిట్టలను కాల్చినట్లు కాల్సిందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కాశ్మీర్ సమస్యతో పోల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. పోలవరం, పులిచింతల, పోతిరెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు తెలంగాణకు ఇచ్చిన హామీలను వేటినీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో యుపిఎ చైర్ పర్సన్ గా తాము ఆనాడు సోనియాను నమ్మామని, నమ్మడం తప్పు కాదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తోందని, అధికారంలో లేనప్పుడు ఒక్క మాట అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతోందని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సియల్పీ) కార్యదర్శిగా ఉన్న జి. చిన్నారెడ్డి తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని, నాయకుడైన రాజశేఖర రెడ్డి అనుమతితోనే ఆ రోజు చిన్నారెడ్డి ఆ డిమాండ్ చేశారని, వారు చెప్పిందే ఇప్పుడు తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికే రాయలసీమ, ఉత్తరాంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+