ఆర్జేడి ఎంపి పప్పూ యాదవ్ కు జీవిత ఖైదు
పాట్నా: సిపియం నాయకుడు అజిత్ సర్కార్ హత్య కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడీ) పార్లమెంటు సభ్యుడు పప్పూ యాదవ్ కు పాట్నా కోర్టు గురువారంనాడు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. మాజీ శాసనసభ్యుడు రాజన్ తివారీకి కూడా ఈ కేసులో కోర్టు జీవిత ఖైదు వేసింది. పప్పూ యాదవ్, రాజన్ తివారిలతో పాటు మరో నిందితుడు అనిల్ యాదవ్ కు జీవిత ఖైదు విధిస్తూ సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
అజిత్ సర్కార్ హత్య కేసు విచారణను కోర్టు ఈ నెలారంభంలో ముగించింది. తీర్పును ఫిబ్రవరి 14వ తేదీన వెలువరించనున్నట్లు ప్రకటించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించాలని పప్పూ యాదవ్ కోర్టును కోరారు. అయితే అందుకు నిరాకరిస్తూ తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. పూర్ణియా శాసనసభ్యుడు సర్కార్ ను 1998 జూన్ 14వ తేదీన పప్పూ యాదవ్ ఆదేశాల మేరకు కాల్చి చంపారనే అభియోగం మోపారు.












Click it and Unblock the Notifications
