పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. పెట్రోల్ ధర లీటరుకు రెండు రూపాయలు పెరగగా డీజిల్ ధర లీటరుకు ఒక రూపాయి పెరిగింది. పెరిగిన ధరలు గురువారం అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. ధరల పెంపుపై రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గురువారం సుదీర్ఘంగా చర్చించి ఆ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధర పెరుగుదలను తట్టుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలకు అదనంగా 840 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ధరల పెంపును ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆంధ్రపదేశ్ కమిటీ కె. నారాయణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
