ఇప్పటికిప్పుడు తేలేది కాదు: వైయస్

Y S Rajasekhar Reddy
హైదరాబాద్: తెలంగాణపై తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం ప్రకటించే వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులకు సూచించారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని పట్టుపట్టి సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం గురువారం ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాము, తెరాస తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధిష్ఠానవర్గానికి తుది నిర్ణయం కోసం అప్పగించామని, ఆ నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ విషయం ఇప్పటికిప్పుడు తేలేది కాదని, చిన్న రాష్ట్రాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. చత్తీస్ ఘడ్ మావోయిస్టులతో సతమవుతోందని, రాష్ట్ర పరిస్థితి మెరుగుగా ఉందని ఆయన చెప్పారు. నక్సలైట్లు కూడా తెలంగాణ రాష్ట్రం కోరుతున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు.

గత ఎన్నికల సందర్భంలో రెండో ఎస్సార్సీకి అంగీకరిస్తూ అప్పుడు తెరాసలో ఉన్న ఎ. నరేంద్ర ఒప్పందంపై సంతకం చేశారని, రెండో ఎస్సార్సీ వేస్తామని తాము ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామని ఆయన చెప్పారు. ఈ సమయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్రతిపక్షాల సభ్యులపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే తమకు గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం కావాలని రాయలసీమ నాయకులు అంటున్నారని, సముద్ర తీరం ఉంటే తప్ప అభివృద్ది చెందలేమనే ఉద్దేశంతో వారు ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కలిపి గ్రేటర్ రాయలసీమ అడుగుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు తాను అడ్డంకి కాదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెనకబడిన ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, తెలంగాణ అభివృద్ది కోసం తాను చేస్తున్న కృషిని చరిత్ర గుర్తు పెట్టుకుంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+