తెలంగాణపై సిపిఐలో చిచ్చు
హైదరాబాద్: సిపిఐలో తెలంగాణ చిచ్చు పుట్టింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చేయడంపై ఎఐయుటిసి నాయకుడు వి.వి. రామారావు ధ్వజమెత్తారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడంపై సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణలపై తీవ్రవమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. సిపిఐ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణ అనవసర ప్రకటనలు మానుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ స్వార్థం కోసమే తెలంగాణకు అనుకూలంగా వారు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
కాగా, రామారావు ప్రకటనను సురవరం సుధాకర్ రెడ్డి తేలిగ్గా కొట్టి పారేశారు. తెలంగాణపై తీర్మానాన్ని మహాసభల్లో ప్రతిపాదిస్తామని, అప్పుడు రామారావు చర్చలో తన అభిప్రాయం చెప్పవచ్చునని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. చెన్నైలో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రతిపాదన చేసే విషయాన్ని ముందు పెట్టామని, ఇప్పుడు ఆ ప్రతిపాదనను ఆమోదం కోసం రాష్ట్ర మహాసభల్లో పెడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
