సిద్ధాంతాలు నచ్చితే చిరంజీవికి మద్దతు: బిజెపి
విజయవాడ: హీరో చిరంజీవి పెట్టదలుచుకున్న రాజకీయ పార్టీ సిద్ధాంతాలు తమకు నచ్చితే భారతీయ జనతా పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకునే అవకాశముందని బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ చెప్పారు.విజయవాడలో జరిగిన బెజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
రాష్ట్ర బిజెపి యువమోర్చా అధ్యక్షుడు, సినీనటుడు నరేష్ మాట్లాడుతూ చిరంజీవి పార్టీలో తాను చేరేది లేదని స్పష్టం ఛేశారు. ఈసారి కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన మూడు నెలల్లో అంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగు విభజిస్తామని పార్టీ నాయకుడు కంభంపాటి హరిబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications