పోలియో ప్రాజెక్టు సమీక్షకు రామదాస్ హామీ

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఏమి చెప్పినా తాము వాటిని అమలు చేస్తున్నాము. గత ఏడాది, ఈ ఏడాది అధిక బడ్జెట్ కేటాయింపు జరిగిన ప్రాజెక్టుల్లో పోలియో కార్యక్రమం కూడా ఒకటని రాందాస్ తెలిపారు. గత ఏడాది ఈ కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపులు రూ.1300 కోట్ల వద్ద ఉండగా, ఈ ఏడాది ఈ కార్యక్రమానికి రూ.1050 కోట్ల నిధులు కేటాయించబడ్డాయని రాందాస్ చెప్పారు.
అయితే ఈ కార్యక్రమం అమలుపై రాందాస్ అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనిని సమీక్షిస్తానని అన్నారు. బీహార్ రాష్ట్రంలో పోలియో కేసులు పెరుగుతున్నాయి. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు త్వరలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని రాందాస్ తెలిపారు. గత వారం దేశ రాజధానిలో 14 ఏళ్ల బాలిక పోలియో బారినపడింది.












Click it and Unblock the Notifications