అసెంబ్లీలో వక్ఫ్ భూములపై రగడ
హైదరాబాద్: వక్ఫ్ ఆస్తుల విక్రయంపై బుధవారం శాసనసభ దద్ధరిల్లింది. వందలాది ఎకరాల వక్ఫ్ భూములను ప్రభుత్వం చౌకగా ఇతరులకు కట్టబెడుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ విషయంపై తెలుగుదేశం, మజ్లీస్ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాంకో అక్రమంగా భూములను పొందిందని విమర్శించాయి. ఇక నుంచి వక్ఫ్ భూములను విక్రయించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం సమాధానంతో సంతృప్తి చెందని ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించాయి.
సభ సద్దుమణగకపోవడంతో సభను టీ విరామం కోసం స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సజావుగా సాగలేదు. దీంతో సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. సభ వాయిదాపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.












Click it and Unblock the Notifications