ఉప ఎన్నికల్లో గెలుపు మాదే: బాబు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల ఖాళీ అయిన శాసనసభా, లోకసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే విజయం తమదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. పి. జనార్దన్ రెడ్డి మృతి వల్ల ఖాళీ అయిన హైదరాబాదులోని ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
వెనకబడిన వర్గాలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అణగదొక్కుతున్నారని, సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పాటించడం లేదని ఆయన విమర్శించారు. రాజ్యసభకు ఐదుగురు అభ్యర్థులను ఎంపిక చేస్తే ఒక బిసి అభ్యర్థి కూడా లేడని, దీన్ని బట్టి కాంగ్రెస్ వైఖరి, ముఖ్యమంత్రి వైఖరి అర్థమవుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి పదవుల్లోనూ బిసిలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో కూడా కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని పాటించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications