రూపాయి జాతకం మారిందా? ఆర్బీఐ మాస్టర్ ప్లాన్ వర్కౌట్!

గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ భారత రూపాయి శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర గందరగోళానికి గురైంది. ఒక్కో దశలో మంచి లాభాల్లోకి దూసుకెళ్లినప్పటికీ... అంతిమంగా స్వల్ప లాభంతో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కేవలం 3 పైసలు పుంజుకుని 95.71 వద్ద స్థిరపడింది. విదేశీ మార్కెట్లలో డాలర్ కొంత బలహీనపడటం రూపాయికి కలసివచ్చినప్పటికీ, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు రూపాయి దూకుడుకు అడ్డుకట్ట వేశాయి.

ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఉదయం రూపాయి 95.69 వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో గరిష్ఠంగా 95.65 స్థాయికి చేరుకుని ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తించింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో వెంటనే కోలుకున్న డాలర్ ధాటికి ఒకానొక సమయంలో 95.75 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరికి గురువారం నాటి ముగింపు (95.74) కంటే కేవలం 3 పైసలు మాత్రమే మెరుగై 95.71 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.

Indian Rupee Holds Steady Against US Dollar RBI Intervention amp amp Record Forex Reserves Support Currency

గడువు కుదింపు.. ఒక్కసారిగా $56 బిలియన్ల వరద!

గడిచిన 30 రోజుల్లో అతిపెద్ద పరిణామం ఏమిటంటే.. ప్రత్యేక విదేశీ డిపాజిట్ పథకానికి (FCNR-B) ఇచ్చిన గడువును ఆర్బీఐ ఆగస్టు 31 వరకు కుదించింది. ఈ ముందస్తు ఆదేశంతో ఒక్కసారిగా విదేశీ కరెన్సీ భారత్‌కు పోటెత్తింది. దీనిద్వారా దేశంలోకి ఏకంగా 56.84 బిలియన్ డాలర్ల నిధులు రాగా, మొత్తం విదేశీ నిధుల ప్రవాహం 80 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఈ నిధుల వరద రూపాయి పతనానికి బలమైన అడ్డుకట్టగా మారింది.

చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్‌కు ఊరట!
చెక్కుచెదరని రూపాయి.. ఆర్బీఐ వ్యూహంతో భారత్‌కు ఊరట!

రూ.707 బిలియన్లకు చేరిన విదేశీ కరెన్సీ నిల్వలు

గత కొద్ది వారాల్లో భారత్ ఫారెక్స్ నిల్వలు సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఫారెక్స్ నిల్వలు ఏకంగా $14.13 బిలియన్లు పెరిగి $707 బిలియన్ మార్కును అధిగమించాయి. ఈ బలమైన ఆర్థిక పునాదితో ఆర్బీఐ స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేస్తూ, రూపాయి విలువను నిలకడగా ఉంచగలుగుతోంది.

మన రూపాయి బ్రహ్మాండం.. యుద్ధం జరుగుతున్నా నిలబడింది
మన రూపాయి బ్రహ్మాండం.. యుద్ధం జరుగుతున్నా నిలబడింది

రాబోయే రోజుల్లో రూపాయి గమనం ఎలా ఉండనుంది?

ప్రస్తుతం ముడిచమురు ధరలు బ్యారెల్‌కు $93 పైనే కొనసాగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు (FII) స్టాక్ మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకోవడం రూపాయికి కొంత ప్రతికూల అంశమే. అయితే, ఆర్థిక వేత్తల అంచనా ప్రకారం... రాబోయే 1-2 నెలల పాటు రూపాయి డాలర్‌తో పోలిస్తే 95 పరిధిలోనే క్రమబద్ధంగా స్థిరపడే అవకాశం ఉంది. మధ్యప్రాచ్య సంక్షోభం తగ్గితే రూపాయి మరింత బలపడి దేశీయ మార్కెట్లకు ఊరటనిచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+