48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!

నీట్ అక్రమాలపై ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నాతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను సాగనంపిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పాఠశాలల పునర్ నిర్మాణంపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో శిధిలావస్ధకు చేరిన పాఠశాలల్ని వెంటనే మరమ్మత్తులు చేసేలా అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని కన్వర్ పురాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల శిధిలావస్ధకు చేరడం, పక్కనే పశువుల కొట్టం కూడా ఉండటంపై ప్రశ్నించిన సీజేపీ కార్యకర్తలపై స్థానికులు దాడులకు దిగారు. దీనిపై మండిపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది.

 కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!
కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!

రాజస్థాన్ లోని కన్వర్ పురాలో వశువుల కొట్టంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన తమ ప్రతినిధులపై దాడులకు దిగడంపై కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) మండిపడ్డారు. బీజేపీ గూండాగిరి చెల్లదని, 48 గంటల్లో సదరు పాఠశాల మరమ్మత్తులు మొదలుపెట్టాలని రాజస్థాన్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఢిల్లీ జంతర్ తరహాలోనే జైపూర్ కు వచ్చి ధర్నా మొదలుపెడతానని హెచ్చరించారు. అలాగే దీనికి తమ మద్దతుదారులు కూడా తరలిరావాలని కూడా దిప్కే పిలుపునిచ్చారు.

Abhijeet Dipke Gives Rajasthan Govt 48-Hour Deadline to Repair School Issues Warning

విజయ్ ఆఫర్ కు నో చెప్పేసిన ఉదయనిధి..! షాకింగ్ రీజన్..!
విజయ్ ఆఫర్ కు నో చెప్పేసిన ఉదయనిధి..! షాకింగ్ రీజన్..!

అలాగే కాక్రోచ్ జనతా పార్టీ స్కూళ్లను సందర్శించడం ప్రారంభించాక.. అక్కడి బీజేపీ ప్రభుత్వం పాఠశాలల్లో ఫొటోలు, వీడియోలు తీయకుండా, బయటి వ్యక్తులు రాకుండా నిషేధాజ్ఞలు విధించడంపైనా కాక్రోచ్ పార్టీ బాస్ మండిపడ్డారు. తమ ప్రతినిధులపై దాడులకు పాల్పడినంత మాత్రాన బెదిరిపోమని, స్కూలును మరమ్మత్తు చేయించేవరకూ వదిలిపెట్టేది లేదని రాజస్థాన్ ప్రభుత్వానికి తేల్చిచెప్పేశారు. ఇప్పటికే రాజస్థాన్ విద్యామంత్రి మదన్ దిలావర్ ను స్కూళ్ల దుస్దితిపై రోజూ ప్రశ్నిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు.. ఆయన స్పందించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. రాజస్థాన్ విద్యామంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో రాజీనామా చేసే రోజు వస్తుందని వారు హెచ్చరికలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+