అయేషా పేరెంట్స్ పై జానా ఆగ్రహం
వరంగల్: విజయవాడలో దారుణంగా హత్యకు గురైన విద్యార్థిని అయేషా తల్లిదండ్రులపై హోం మంత్రి కె. జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అయేషా హత్య కేసులో తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అయేషా హత్య కేసులో అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. అయేషా హత్య కేసులో అవసరమైతే పోలీసులకు కూడా నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జర్నలిస్టులపై, మంత్రులపై, ఎవరిపై అనుమానం ఉంటే వారందరిపై నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.
మంత్రి జానారెడ్డి తీరుపై అయేషా తల్లి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తమ కూతురు హత్య కేసులో న్యాయం జరగాలని అడుగుతున్నామే తప్ప తమకెలాంటి ఉద్దేశాలు లేవని ఆమె అన్నది. అయేషా హత్య కేసులో న్యాయం జరగాలంటూ జరుగుతున్న దీక్షా శిబిరాన్ని ఆమె ఆదివారంనాడు సందర్సించింది. కేసులో న్యాయం జరగాలని అడుగుతుంటే నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి, హోంమంత్రి అనడం బాధాకరంగా ఉందని ఆమె అన్నది.












Click it and Unblock the Notifications